ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన డివైఎస్పీ సిహెచ్ వి బాలసుబ్రమణ్యం
BSBNEWS - కందుకూరు
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వెంగమాంబ కళ్యాణ మండపంలో ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంను కందుకూరు డిఎస్పి సిహెచ్ వి.బాలసుబ్రమణ్యం మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. జి. కృష్ణ కాంత్ ఐ.పీ.యస్ ఔదార్యంతో తన క్రింది పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం కోసం ఆలోచించి కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ వైద్య శిబిరంలో కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో గల పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హాజరై ఉచితంగా హృదయ, ఊపిరితిత్తులు, ఎముకలు సంబంధిత వైద్య పరీక్షలు, బీపీ షుగర్ లాంటి టెస్టులు చేయించుకుని సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ల చే తగిన చికిత్సలు, మందులు, నివారణ సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలకు అవకాశం కల్పించిన నెల్లూరు జిల్లా ఎస్పీకి, ఈ క్యాంపు నిర్వహణకు సహకరించిన రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ల సూచనల మేరకు మందులు, వారి సలహాలు పాటించి వారికి గల శారీరక రుగ్మతలను తగ్గించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.