మంచి మనసుని చాటుకున్న ఉపాధ్యాయులు

bsbnews
0

మంచి మనసుని చాటుకున్న ఉపాధ్యాయులు

BSBNEWS - కందుకూరు 

మండలంలోని పోలినేనిపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు నాలుగో తరగతి చదువుతున్న బొగ్గవరపు నాగ వెంకట భవ్య అను దివ్యాంగురాలుకి, నిరంతరం విద్యార్థులకు సేవలందించాలనే సంకల్పం, మంచి మనసు కలిగిన నలదలపూరు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు ఆధ్వర్యంలో గణిత ఉపాధ్యాయులు కే.సుధాకర్ రావు, ఆంగ్ల ఉపాధ్యాయుడు టిఎస్ఆర్ మూర్తి, సైన్సు ఉపాధ్యాయుడు కే గిరిబాబు, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడు ఎస్ రమేష్  కలిసి రూ 6000/-లు విలువచేసే వీల్ చైర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు అలివేలమ్మ మాట్లాడుతూ ఎంతోకాలంగా ఎంతోమందిని వేడుకొన్న ఏ ఒక్కరూ మా గోడు వినిపించుకోలేదని ఆ సమయంలో నలదలపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేయుచున్న పోలినేనిపాలెం గ్రామ నివాసి అయిన బీరకాయల మాధవరావు, గణిత ఉపాధ్యాయుడు కనిశెట్టి సుధాకర్ రావును  కలిసి తమ బిడ్డ పరిస్థితిని తెలియపరచగా విని వెంటనే స్పందించి తమ బిడ్డకు వీల్ చైర్ ను ఉచితంగా అందజేశారని, సహాయాన్ని అందించినందుకు వారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలినేని పాలెం అప్పర్ ప్రైమరీ కోటకొండ ప్రైమరీపాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటకొండ శామ్యూల్  సిబ్బంది పాల్గొని దాతలను అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)