సి సి కెమెరాలు పాత్ర ప్రముఖం

bsbnews
0

 సి సి కెమెరాలు పాత్ర ప్రముఖం

కందుకూరు లో 52 కెమెరాలు ఏర్పాటు

BSBNEWS - కందుకూరు 





సీసీ కెమెరా నిఘా నేత్రం ఉంటే ఎటువంటి దొంగలనైనా పట్టుకొని ప్రజలకు రక్షణ కల్పింపించవచ్చని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో సీసీ కెమెరాలను కందుకూరు డిఎస్పీ సి.హెచ్.వి బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో పాటు ధైర్యంగా ఉండాలి అని,  ప్రజల రక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలను అందించేలా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు అని, దానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు లోకేష్ బాబు ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిలో ముందడుగు వేస్తున్నారని ఆయన అన్నారు. కందుకూరు పట్టణంలో అంత ముందు అనేక రూమర్స్ వచ్చాయి అని, వాటికి పుల్ స్టాప్ పెట్టి కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందేలా ఒక మంచి సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు. శాంతిభద్రల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు అని, ఎవరు అయినా సరే, మా ఇంట్లో వారైనా సరే తప్పు చేస్తే వారిని విడిచిపెట్టొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ కు చెప్పడం జరిగిందని ఆ దిశగా పోలీసులు పనిచేసి పట్టణంలో శాంతిభద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన వ్యాపార సంస్థలకు, వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీ సిహెచ్ వి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల ఖర్చుతో 52 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించేందుకు డీజీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్పీ కృష్ణ కాంత్ పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, మా కృషికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. నేరాలతోపాటు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలకు కారమైన ఆధారాలను సేకరించుటలో కూడా సీసీ కెమెరా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వ్యాపార సంస్థలు, ఇంటి యజమానులు ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలు జరిగే సమయంలో దొంగలను సీసీ కెమెరా పట్టిస్తుందని ఆయన అన్నారు. పాత సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నూతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాలు ప్రతినిత్యం ఆపరేటింగ్ చేయుటకు ఒక వ్యక్తిని పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం సీసీ కెమెరాలకు సహకరించిన వ్యాపారస్తులను, వైద్యులను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐ కె. వెంకటేశ్వరరావు, గుడ్లూరు సిఐ మంగారావు, పట్టణ ఎస్ఐ వి సాంబశివయ్య, రూరల్ ఎస్సై మహేంద్ర నాయక్, పోలీస్ సిబ్బంది, వ్యాపారస్తులు, వైద్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)