భీమా కోరేగావ్ యుద్ధ విజయ స్ఫూర్తిని కొనసాగించాలి.. బి టి ఏ

0

భీమా కోరేగావ్ యుద్ధ విజయ స్ఫూర్తిని కొనసాగించాలి.. బి టి ఏ 

BSBNEWS - కందుకూరు


 భీమా కోరేగావ్ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని బి టి ఏ ఉపాధ్యాయ సంఘ  నాయకులు, సామాజిక ఉద్యమ నాయకులు బుధవారం పట్టణం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ అనంతరం భీమా కోరేగావ్  యుద్దంలో మరణించిన వీర సైనికులకు నివాళులు అర్పించారు. ఏ ఏ డి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గ్యారా చిరంజీవి  మాట్లాడుతూ భీమా కోరేగావ్ యుద్ధం చరిత్రలో బానిసత్వానికి ఆదిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కొరకు జరిగిన మహత్తర  పోరాట విజయమని అన్నారు. ఈ విజయాన్ని భారత దేశంలోనే బహుజనులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్లగుంట మోహన్ రావు షేక్ అబ్దుల్లా చొప్పర  కొండలరావు మండూరి రమణయ్య కసుకుర్తి అంజయ్య మెండ వెంకట్రావు వలేటి మాలకొండయ్య  రిటైర్డ్ ఉపాధ్యాయులు  గెరా జైపాల్  కొచ్చర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)