నారా లోకేష్ జన్మదిన వేడుకలలో మంత్రి స్వామి

bsbnews
0

 నారా లోకేష్ జన్మదిన వేడుకలలో మంత్రి స్వామి 

BSBNEWS - KANDUKUR 

కందుకూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రినారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఏర్పాటుచేసిన నారా లోకేష్ పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తున్నాయని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యేగా ఘనంగా నిర్వహించటం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)