పెద్ద బజారులో జాతిపిత మహాత్మునికి ఘన నివాళులు
BSBNEWS - KANDUKUR
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పెద్ద బజారునందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహ కమిటీ సభ్యులు పబ్బిశెట్టి వరదరాజ, నల్లమల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గాల్లో ప్రతి ఒక్కరు నడవాలని కేశవరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కోటా కిషోర్ బాబు, ఇస్కాల మధు, తాతా లక్ష్మీనారాయణ, తుమ్మపూడి వెంకటసుబ్బయ్య, మురారిశెట్టి వెంకటేష్, మోదడుగు శ్రీను, చీదెండ్ల తిరుమల, ఓరుగంటి శంకర్, సీఎం శ్రీను, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.