ఇంటూరి సుబ్బమ్మ దశదినకర్మ లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని కొండసముద్రం గ్రామంలో నెల్లూరు జిల్లా టెలికాం బోర్డు మెంబర్ గుర్రం మాల్యాద్రి అమ్మమ్మ ఇంటూరి సుబ్బమ్మ (షావుకారు) ఇటీవల మరణించారు. గురువారం మండలంలోని కొండసముద్రం గ్రామంలోని సుబ్బమ్మ ఇంటి వద్ద జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.