కందుకూరు వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో చిన్నారి వైద్యానికి చేయూత

bsbnews
0

కందుకూరు వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో చిన్నారి వైద్యానికి చేయూత

BSBNEWS - కందుకూరు

చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అంటూ  కందుకూరు వాసవి క్లబ్ లెజెండ్స్, వనిత క్లబ్ ల ఆద్వర్యంలో గురువారం సుందరయ్య నగర్ లో నివసిస్తున్న కీళ్ళ నొప్పుల వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చిరుమామిళ్ల రామారావు కుమారుడు రాజా శబరినాథ్ సహకారంతో ఒక నెలకు సరిపడా మందులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు గారు మాట్లాడుతూ కందుకూరు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో పేదలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని,ఈ సందర్భంగా దాతలకు దన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ చీదెళ్ళకృష్ణ, రీజియన్ చైర్ పర్సన్ కోట వెంకటేశ్వర్లు, చిరుమావిళ్ల రాజా శబరినాథ్,శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సేవా హృదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు,వైస్ ప్రెసిడెంట్ రవ్వా అరుణ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)