నాగార్జున పబ్లిక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

bsbnews
1 minute read
0

నాగార్జున పబ్లిక్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

- సంక్రాంతి సంతోషాలు, భోగభాగ్యాలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి 

- కరస్పాండెంట్ షాలిని రెడ్డి 

BSBNEWS - కందుకూరు 



పట్టణంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ యాజమాన్యం  ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు రంగవల్లులను తీర్చిదిద్దారు. విద్యార్థులు గాలిపటాలను ఎగరవేసి సంక్రాంతికి స్వాగతం పలికారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కరస్పాండెంట్  అందరూ కలిసి భోగిమంటలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. సంప్రదాయ సంక్రాంతి వేషాలు హరిదాసులు, గోపికలు వేషధారణతో అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళను వేసి ఆశీర్వాదాలను అందించిన కరస్పాండెంట్ దీవెనలను అందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ షాలిని రెడ్డి  మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఈ నూతన సంవత్సరంలో అందరి జీవితాల్లో భోగి వెలుగులు, సంక్రాంతి సంతోషాలు, కనుమ పండుగల భోగభాగ్యాలు  కలగాలని కోరుకున్నారు. విద్యార్థులు చదువుల్లో విశేషంగా రాణించాలని తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన స్కూలుకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మర్రెడ్డి, బాల బ్రహ్మం, శ్రీనివాసులు, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0Comments
Post a Comment (0)