భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

bsbnews
0

 బాలకృష్ణ పై అభిమానం చాటుకున్న అభిమానులు

భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - కందుకూరు 




సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై ఆయన అభిమానులు తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పట్టణంలోని అన్నా క్యాంటీ న్ వద్ద నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణం అవార్డు వచ్చిన సందర్భంగా భారీ కేకును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని నందమూరి అభిమానులు ఏర్పాటుచేసిన భారీ కేకును కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సినీ లెజెండ్ నందమూరి బాలకృష్ణ అని, అటు తన సినీ రంగంలో ఉన్నత శిఖరానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్న క్యాంటీన్లో టోకెన్ల ద్వారా బాలకృష్ణ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలకు భోజనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, చిలకపాటి మధు బెజవాడ ప్రసాద్ ఇతర టిడిపి ముఖ్య నేతలు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)