నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన నేలపాటి బ్రహ్మయ్య చౌదరి

bsbnews
0

 నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన నేలపాటి బ్రహ్మయ్య చౌదరి

BSBNEWS - హైదరాబాద్ :

 ప్రముఖ సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మీడియా కమిటి చైర్మన్ నేలపాటి బ్రహ్మయ్య చౌదరి హైదరాబాద్ బాలకృష్ణ నివాసంలో ఆయనను కలసి ఘనంగా సన్మానించి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేలపాటి బ్రహ్మయ్య చౌదరి మాట్లాడుతూ తన అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ కు  పద్మభూషణ్ అవార్డు రావడం తనతోపాటు బాలయ్య అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు  ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో నందమూరి బాలకృష్ణ మరెన్నో ఉన్నతమైన పురస్కారాలు అందుకోవాలని  నేలపాటి బ్రహ్మయ్య చౌదరి ఆకాంక్షించారు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణకి ప్రకాశం జిల్లాలోని దామచర్ల కుటుంబ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)