జిల్లా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంఐఎస్ కీర్తి
వెల్లువెత్తిన అభినందనలు
BSBNEWS - కందుకూరు
76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఎంఐఎస్ గా కందుకూరు ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎన్ కీర్తి ఎంపికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నెల్లూరు లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. బాలాజీ రావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య చేతుల మీదగా జిల్లా స్థాయి ఉత్తమ ఎంఐఎస్ గా ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్ధాయి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సకాలంలో నివేదికలు అందజేసినందుకుగానూ తమకు అవార్డు లభించినట్లు అవార్డు గ్రహీత కీర్తి తెలిపారు. జిల్లా స్ధాయి అవార్డుకు ఎంపిక చేసినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్ధాయిలో ఉత్తమ సేవా అవార్డును అందుకున్న కీర్తిని ఎంఈఓ లు బి. అజయ్ బాబు, కె సుబ్బారెడ్డి లతో పాటుగా సహచర సమగ్ర శిక్ష ఉద్యోగులు, మండలంలోని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.