నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించండి
BSBNEWS - కందుకూరు
నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేలా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిపిఐ కందుకూరు సమితి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో భాగంగా నిరుపేదలకు పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాలను కేటాయిస్తానని హామీ ఇచ్చారని దానిని వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు. సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి బి.సురేష్ బాబు మాట్లాడుతూ పేదవారి ఇంటి కల నెరవేర్చుటకు సిపిఐ తరఫున పోరాటం సాగిస్తున్నాని ఇల్లు లేని ప్రతి ఒక్కరు కందుకూరు లోని కార్యాలయానికి రావాలని మా దృష్టికి వచ్చిన ఇళ్ల సమస్యను అర్జీల రూపంలో సంబంధిత అధికారులకు అందజేసి నిజమైన అర్హత కలిగిన వారికి ఇల్లు మంజూరు అయ్యేలా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం లో ఇచ్చిన జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం కొరకు, ప్రస్తుతం ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు తో పాటు ఇసుక, కంకర, ఇనుపరార్డులను ఉచితంగా అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనంద మోహన్, నాయకులు నత్తా రామారావు, ఉప్పుటూరి మాధవరావు బొల్లోజుల బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.