సమాజం ఆడపిల్లల పట్ల సంస్కారవంతమైన దృక్పథంతో వ్యవహరించాలి

bsbnews
0

 సమాజం ఆడపిల్లల పట్ల సంస్కారవంతమైన దృక్పథంతో వ్యవహరించాలి 


BSBNEWS - KANDUKUR


స్థానిక టి. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఎన్.ఎస్.ఎస్ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించబడింది. సభకు అధ్యక్షత వహించిన కళాశాల వైస్ ప్రిన్సిపాల్  డాక్టర్ నరేంద్ర ఏడుకొండలు బాలికల హక్కులు గూర్చి వివరించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకులు శ్రీ వి.కృష్ణశర్మ మాట్లాడుతూ సమాజం ఆడపిల్లల పట్ల సంస్కారవంతమైన దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, బాలికల అక్రమ రవాణా, పౌష్టికాహార లోపం వంటి సమస్యలపై సమాజం చైతన్యవంతం కావాలని అన్నారు. ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. నరేష్ రాజా మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధిలో గానీ సమాజాభివృద్ధిలో గానీ స్త్రీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, బాలికల పరిరక్షణ బాధ్యత యావత్ సమాజంపై ఉందని   తెలియజేశారు. మహిళా సాధికారత విభాగాధిపతి షేక్ షానాజ్ బేగం మాట్లాడుతూ సమాజంలో బాలికల పట్ల జరిగే అమానుషాలు, దాడులను ఖండిస్తూ వాటిని ఎదుర్కోవడంలో ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతని నిర్వహించవలసిన అవసరాన్ని గూర్చి నొక్కి వక్కాణించారు. సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పటికీ,  సమాజంలో అనేక మార్పులు సంభవిస్తున్నప్పటికీ బాలికలకు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోని స్థితిలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని  పలువురు విద్యార్థినీ విద్యార్థులు కూడా తమ కవితలు, ప్రసంగాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఫస్ట్ బికాం విద్యార్థిని వైశాలి బాలికా  దినోత్సవం నేపథ్యాన్ని గూర్చి తెలియజేసింది. ఫస్ట్ బిఏ విద్యార్థిని సింధూర తాను రచించిన కవిత ద్వారా సమాజంలోని బాలికల స్థితిగతులను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించింది. ఫస్ట్ బి ఏ విద్యార్థిని వైష్ణవి మాట్లాడుతూ బాలికలు ఎదగడానికి కావలసిన పరిస్థితులను, అవకాశాలను సమాజం కల్పించాలని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె.  సుజాత, రసాయన శాస్త్ర అధ్యాపకులు కె.వి. పద్మావతి, స్టాటిస్టిక్స్ అధ్యాపకులు,వి. రామకృష్ణ, చరిత్ర అధ్యాపకులు   డాక్టర్ .డి. రామాంజనేయులు, జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఐ. అనూష,  ఎమ్. జ్యోతి, హిందీ అధ్యాపకులు డి, రాఘవరావు, కామర్స్ అధ్యాపకులు వై.దివ్య, వృక్ష శాస్త్ర అధ్యాపకులు ఎం. బాలు నాయక్ తదితర అధ్యాపక సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)