ఎమ్మెల్యే ఇంటూరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు

bsbnews
0

ఎమ్మెల్యే ఇంటూరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు

BSBNEWS - కందుకూరు 

ఇటీవల గుడ్లూరు మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అమరా మాల్యాద్రి  బుధవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమరా మాల్యాద్రికి , వారి కార్యవర్గాన్ని అభినందించారు. ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో సహాయ సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎయిర్టెల్ చిన్న, ప్రధాన కార్యదర్శి గరటయ్య, బిజెపి నాయకులు ఇన్నమూరి సుధాకర్ రావు, కందుకూరు ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, చక్కా వెంకట కేశవరావు, కోటా కిషోర్ బాబు, కంకణాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)