హెల్మెట్ తో ప్రయాణం సురక్షితం...రవాణా శాఖ అధికారి లక్ష్మి

bsbnews
0

 హెల్మెట్ తో ప్రయాణం సురక్షితం...రవాణా శాఖ అధికారి లక్ష్మి 


BSBNEWS- కందుకూరు


36 వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టివిఎన్ లక్ష్మీ  ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వాహన దారులకు హెల్మట్ పెట్టుకోవటం వలన కలుగు ప్రయోజనములగురించి వివరిస్తూ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమము  కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్  వరకు  బైక్ ర్యాలీ జరిగింది. అక్కడ వాహనదారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించక హెడ్ ఇంజురీ అయి ఎక్కువమంది  చనిపోతున్నారని అందులో ముఖ్యముగా 18 నుండి 30 ఏళ్ల వయసు ఉన్న యువత చనిపోతున్నారని తెలియచేశారు. మోటార్ బైక్ నడిపేటప్పుడు తప్పని సరిగా ఐ ఎస్ ఐ మార్క్ కలిగిన హెల్మెట్స్ ధరించవలెనని వివరించారు.అదేవిధంగా ప్రతి  వాహనదారుడు రవాణా శాఖ పనుల నిమిత్తం కార్యాలయమునకు వచ్చునప్పుడు విధిగా హెల్మెట్ ధరించి రావాలని, హెల్మెట్ ధరించడం మీ సురక్షితం కొరకేనని అన్నారు .

కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెన్నూరి రాంబాబు  మాట్లాడుతూ  ఏదైనా సందర్భంలో ప్రమాదం జరిగినపుడు ప్రతి పౌరుడు తమ భాద్యతగా స్పందించి వారికి ప్రధమ చికిత్స అందేవిధంగా చూడవలెనని సూచించారు.బైక్ పై వెళ్ళేటప్పుడు మితిమీరిన వేగంతో వెళ్ళవద్దు అని, రోడ్ పై వాహనం ద్విచక్ర వాహనం నడుపునపుడు విధిగా హెల్మెట్ ధరించవలెనని కార్ నడుపునప్పుడు సీట్ బెల్ట్ ధరించవలెనని తగు జాగ్రత్తతో ఎదుటి వాహనములను  గమనిస్తూ ప్రమాదాలబారిన పడకుండా సురక్షితంగా తమ గమ్యస్థానమునకు చేరవలెనని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  గోపి నాయక్  మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్ చేయరాదని సెల్ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)