BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు కొలతలు తీసుకుంటున్న వ్యక్తులను ప్రజలతో కలసి కందుకూరు మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ దివి శివరాం వారిని అడ్డుకొని పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు అనుమతితో కొలతలు తీసుకుంటున్నారు అని, పెట్రోల్ బంకు ఏర్పాటు కొలతలకు అనుమతులు ఉంటే అనుమతులు చూపించాలని మండిపడ్డారు. ప్రజల అధిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారా ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.