అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి సంబరాలు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని పడమటి మంగళ పాలెం అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి సంబరాలు సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సిడిపిఓ శర్మిష్ఠ ప్రకాశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ పిల్లలకి భోగి పండ్లు పోశారు. బొమ్మల కొలువు ఎద్దుల బండ్ల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి పండగ వాతావరణం సృష్టించటం చాలా సంతోషంగా ఉందని అంగన్వాడీ కార్యకర్తలను ప్రశంసించారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు కళ్ళకు కట్టినట్టు కార్యక్రమాలు నిర్వహించటం అందరి వల్ల కాదని చిన్నారులచే ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లను, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్నప్పటినుండే చిన్నారులకు మన సాంప్రదాయాలను అర్థమయ్యేలా కళ్ళ కట్టినట్టు వారికి చూపిస్తూ వారిచే వేషభాషల ద్వారా చేయించటంతో చిన్నారులకు మన సాంప్రదాయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చీదేళ్ళ వేణు, కళ్యాణ్, సూపర్వైజర్ సునీత, అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.