B.R OXFORD విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన సబ్ కలెక్టర్

bsbnews
0

 B.R OXFORD విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన సబ్ కలెక్టర్

BSBNEWS - కందుకూరు

15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కందుకూరు నియోజకవర్గస్థాయిలో నిర్వహించబడిన వ్యాస రచన క్విజ్, వక్తృత్వ పోటీలలో కందుకూరు B.R ఆక్స్ ఫర్డ్ కాలేజ్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనను కనపరిచారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ విజేతలకు ప్రశంసా పత్రాలు అందించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో బి.నిహారిక (ప్రథమ స్థానం), షేక్ నజ్లీన్(తృతీయ స్థానం),M.V.L నిహారిక (తృతీయ స్థానం) లు ఉన్నారు. ఈ సందర్భంగా B.R OXFORD విధ్యాసంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కర రావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా మంచి అవగాహన ఉన్నప్పుడే వారు ఉత్తమ పౌరులుగా తయారవుతారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కరరావు, బి.నరేంద్ర బాబు ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)