100 కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి తరలించింది పాత నేరస్తులే
BSBNEWS - కందుకూరు
విశాఖపట్నం నుండి తమిళనాడు వైపు తరలిస్తున్న 100 కేజీల గంజాయిని కందుకూరు సీఐ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉలవపాడు ఎస్సై అంకమ్మరావు తమ సిబ్బందితో సోమవారం పట్టుకోవడం జరిగిందని కందుకూరు డిఎస్పి సిహెచ్ వి. బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం కందుకూరు డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ సి.హెచ్.వి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఉలవపాడు లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మహేంద్ర వాహనంను పోలీసు సిబ్బంది ఆపడానికి ప్రయత్నించగా వారు వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో సిబ్బంది వెంబడించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారని, మరొకరు పారిపోయారని తెలిపారు. పట్టుకున్న వ్యక్తులను విచారించగా ఒరిస్సాలో గంజాయి కొని తమిళనాడుకు తరలిస్తున్నారని వీరికి తమిళనాడుకు చెందిన వ్యక్తి రూట్ మ్యాప్ ఇవ్వటం జరుగుతుందని వారు ఇచ్చిన ప్రకారం ఈ గంజాయిని కావలి వరకు చేరుస్తామని ఆ తరువాత వారు ఇచ్చిన రోడ్డు ప్రకారం తమిళనాడుకు చేరుస్తామని ముద్దాయిలు చెప్పడం జరిగిందన్నారు. పట్టుకున్న వ్యక్తులు పాత నేరస్తులేనని వారిపై గూడూరులో రెండు కేసులు ద్రాక్షాపల్లిలో ఒక కేసు ఉందని మొత్తంగా మూడు కేసులు వారిపై ఉన్నాయని ఆయన తెలిపారు. గంజాయితోపాటు వాహనాన్ని మూడు సెల్ఫోన్లను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు గంజాయి పై నిగా పెట్టడం జరిగిందని అందులో భాగంగా పాత నేరస్తుల కదలికల ఆధారంగా పట్టుకున్నామని ఆయన తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 17.50000 ఉంటుందని ఆయన తెలిపారు. ఎంతో చాకచక్యంతో గంజాయిని పట్టుకున్న కందుకూరు సిఐకే వెంకటేశ్వరరావు ఉలవపాడు ఎస్సై అంకమ్మరావు, పోలీసు సిబ్బందిని అభినందించారు.