ఎస్ టి యు ఆధ్వర్యంలో ముగ్దుం మొహియుద్దిన్ 117వ జయంతి వేడుకలు

bsbnews
0

 ఎస్ టి యు ఆధ్వర్యంలో ముగ్దుం మొహియుద్దిన్ 117వ జయంతి వేడుకలు 

BSBNEWS - కందుకూరు 

స్వాతంత్ర సమరయోధులు, అభ్యుదయ కవి, కమ్యూనిస్టు నాయకులు , రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ ముగ్దుం మొహియుద్దిన్ 117వ జయంతి కార్యక్రమం ఎస్టియు కందుకూర్ జోన్ కన్వీనర్ గద్దగుంట వెంకటేశ్వర్ల అధ్యక్షతన ప్రాంతీయ కార్యాలయం కందుకూరు నందు జరిగినది. ఈ సందర్భంగా ఎస్టియు జిల్లా అధ్యక్షులు వై. అశోక్ బాబు మాట్లాడుతూ నిజాం నిరంకుశ  పాలనకు వ్యతిరేకంగా పోరాడి, అనేకమంది కార్మికుల సంఘ పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసి, శాసన సభ్యునిగా శాసనమండలి సభ్యునిగా తన పోరాటాన్ని కొనసాగించి, ఆనాటి ఉపాధ్యాయు ల హక్కులను కాలా రాస్తుంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడిన దాన్ని సాధించేవరకు తన ఉద్యమాన్ని కొనసాగించిన మహోన్నత వ్యక్తి మగ్ధూం మొహియుద్దిన్ అని అన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ పి కృష్ణయ్య మాట్లాడుతూ మగ్ధూం మొహియుద్దీన్ తన జీవితాన్ని త్యాజించిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడని, నేడు ప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఇచ్చిన జీవోకు అనుగుణంగా చేయాలని, అప్పుడే ప్రాథమిక విద్య నిర్వీర్యం కాకుండా ఉంటుందని, ప్రాథమిక విద్యను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల ఆర్థిక కార్యదర్శి కే మధు, వి వి పాలెం మండలం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కేపీ జాన్సన్ ,ఎస్కే బాబు, టీ తిరుపాలు, సిహెచ్ వేణు కే రవి, లింగసముద్రం నాయకులు పి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)