14 సైకిళ్లను పంపిణీ చేసిన వరల్డ్ విజన్
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 14 మంది బాలికలకు కందుకూరు వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ కే సుబ్బారెడ్డి చేతుల మీదుగా 14 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలకు సుదూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి వరల్డ్ విజన్ వారు వారికి సైకిళ్లను ఇచ్చి వారి చదువుకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారకామాయి, వరల్డ్ విజన్ మేనేజర్ యాషియా, వరల్డ్ విజన్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.