15 న సిఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడం ఖాయం - దివి శివరాం

0

15 న సిఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడం ఖాయం

- దివి శివరాం 

BSBNEWS - కందుకూరు

కందుకూరు పట్టణంలోని దివి శివరాం ఇంటి వద్ద కందుకూరు అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు వస్తున్న సందర్భంగా అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో పలు సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాం అన్నారు. కందుకూరు రెవెన్యూ డివిజన్లో నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలుపుతానని గతంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఉన్నారని దానిని అమలు చేయాలని చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం అందిస్తామని అన్నారు. కందుకూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోలు బంకుకు గత ప్రభుత్వం  పెట్రోలు బంకుకు స్థలం కేటాయించారని దానిలో ఇప్పుడు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లయితే ప్రజలు నానా అవస్థలు పడతారు అని అక్కడ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయకుండా నిలుపుదల చేయాలని చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం అందిస్తామని అన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు నిర్వీర్యం కాకుండా చూడాలి అని ఆయన అన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)