కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 26 వేల టన్నుల చెత్తనా ...?
కొమ్మారెడ్డి పట్టాభి రామ్
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే డంపింగ్ యార్డ్ కష్టాలు
ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - కందుకూరు
ఫిబ్రవరి 15వ తేదీన శనివారం కందుకూరులో జరగబోతున్నటువంటి స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు అవుతున్నారని, స్వచ్ఛ కందుకూరుకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మా రెడ్డి పట్టాభిరాం స్పష్టం చేశారు. స్థానిక ఎంఎల్ఏ ఇంటూరి నాగేశ్వరరావు కోరిక మేరకు కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ తో పాటు దూబగుంట గ్రామ సమీపాన ఏర్పాటు చేసిన వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ నీ టీడీపీ సీనియర్ నాయకులు దివి శివరాం, ఉన్నతాధికారులతో కలిసి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న జరగబోతున్నటువంటి స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ కందుకూరు కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారనీ
ఆరోజున రాష్ట్రంలో ఉన్న ప్రజా
ప్రతినిధులు, అధికారులు అంతా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారనీ ఆయన తెలిపారు.
కందుకూరు పట్టణ పారిశుధ్య నిర్వహణలో ఉన్న ప్రధాన సమస్యలపై సోమవారం స్థానిక శాసనసభ్యులతో కలిసి ఉన్నతాధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. గత పాలకులు కందుకూరు పట్టణాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో చూస్తేనే తెలుస్తుందనీ పట్టాభి మండిపడ్డారు. 26 వేల టన్నుల చెత్త ఉన్న డంపింగ్ యార్డ్ నీ కందుకూరులోనే జనావాసాలు ఉన్న చోట ఏర్పాటు చేయడం బాధాకరమని, వంద రోజుల్లోనే ఈ డంపింగ్ యార్డ్ నీ ఖాళీ చేసి ఆ ప్రదేశాన్ని పచ్చని పబ్లిక్ పార్క్ గా మార్చి ఇక్కడి ప్రజలకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి కందుకూరు నగరంలో ప్రతి రోజూ వచ్చే 25 టన్నుల చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి దూబగుంటలో ఏర్పాటు చేసిన వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కి తరలిస్తామని ఇక నుంచి ప్రాసెసింగ్ యూనిట్స్ తప్ప డంపింగ్ యార్డ్ సమస్య ఉండదని, రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పట్టాభి తెలిపారు. ఐటీసీ వారు ఇక్కడి ప్రజలకి తడి చెత్త,పొడి చెత్త పై అవగాహన కల్పించడమే కాకుండా దగ్గరుండి ప్రాసెసింగ్ కూడా చేయిస్తారన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లే డంపింగ్ యార్డ్ ఈ దుస్థితిలో ఉందని, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి తరలించి సుదూర ఏర్పాటు ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణంలోని దూబగుంట గ్రామం వద్ద వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ తడి, పోడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు అందజేయాలని ప్రజలకు సూచించారు. కందుకూరు పట్టణాన్ని స్వచ్ఛ కందుకూరుగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యేగా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, కందుకూరు మునిసిపల్ కమీషనర్ కొర్రపాటి అనూష, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.