బాలికల పాఠశాల అభివృద్ధికై 6 లక్షల విలువైన పరికరాలు అందజేత
BSBNEWS - కందుకూరు
పట్టణములోని బాలికల పాఠశాలకు అవసరమైన ఆరు లక్షలు విలువైన పరికరాలను, విద్యార్థులకు సైకిల్ లను కందుకూరు రీజన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆక్టివిటీ క్రింద వాటర్ ప్లాంట్, కంప్యూటర్లు, కుర్చీలు, ప్రింటర్లు, మరమ్మత్తులు నిమిత్తం మొత్తం అక్షరాల ఆరు లక్షల రూపాయలు విలువైన వస్తువులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్ చేతుల మీదగా అందజేయడం జరిగింది అని అన్నారు. ఎంపీయుపి స్కూల్ పెంట్రాల బాలికలకు సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం పై స్కూల్ హెచ్ఎం ద్వారకామయి, సిబ్బంది ఎస్బిఐ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ కే సూర్యప్రకాష్, మేనేజర్ హెచ్ఆర్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.