వైసిపిని వీడి టిడిపిలోకి చేరికలు

bsbnews
0

 వైసిపిని వీడి టిడిపిలోకి చేరికలు

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి తెలుగుదేశం పార్టీలో చేరేమన్న నేతలు

BSBNEWS - కందుకూరు 



కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు పట్టణంలోని 5వ వార్డు బృందావనం కాలనీకి చెందిన వైసిపి సీనియర్ నాయకుడు దాసరి మాలకొండయ్య, గుడ్లూరు మండలం పరకొండపాడు పంచాయతీ అగ్రహారం నుంచి పులి మహేంద్ర, పులి నారాయణ పులి మన్మధరావు, పులి హరిచంద్ర ప్రసాద్, పులి మనో, పులి మాలకొండయ్య, గంధం మాలకొండయ్య, కొండారెడ్డి పాలెం గ్రామానికి చెందిన హరికృష్ణ  కుటుంబాల వారు వైసిపి పార్టీకి రాజీనామా చేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన 15 కుటుంబాల వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సుమిచిత స్థానం ఉంటుందని, పాత కొత్త నాయకులందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ  కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, వారి అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని పార్టీలో చేరిన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, టిడిపి నాయకులు తలతోటి మస్తాన్, చనమాల శ్రీధర్, పులి నాగరాజు, శ్యామ్, శీను, ఏపూరి కృష్ణ,  వడ్డెళ్ళ రవిచంద్ర, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)