మా దూబగుంటకు అన్యాయం చేయకండి సార్లూ

bsbnews
0

మా దూబగుంటకు అన్యాయం చేయకండి సార్లూ 

BSBNEWS - కందుకూరు

మున్సిపాలిటీ పరిధిలోని  దూబగుంట శివారు ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మించి మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్ధని దూబగుంట ప్రాంత నివాసస్తులు మంగళవారం దూబగుంట అంబేద్కర్ బొమ్మ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని  దూబగుంట శివారు ప్రాంతంలో డంపింగ్ యార్డ్ కొరకు గత వైసిపి ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి శ్రీకారం చుట్టి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి వద్ద నుండి స్థలము బలవంతంగా లాక్కొని డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టారని వారు ఆరోపించారు. అప్పటి నుండి దూబగుంట గ్రామానికి చెందిన మేమంతా డంపింగ్ యార్డ్ ఇక్కడ వద్దు అంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ అధికారులను వేడుకుంటూ ఉన్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం చేసిన పొరపాటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేయొద్దంటూ కందుకూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని కోరారు. ఇప్పటికే దూబగుంటలో మేము ఉంటున్న మా వార్డు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది అని, ఇప్పుడు ఏకంగా మా ఆరోగ్యం, జీవితాలను నాశనం చేసే డంపింగ్ యార్డ్ మా గ్రామ సమీపాన ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం అది డంపింగ్ యార్డ్ కాదు, వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ చెప్పటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ అధికారులు విక్కిరాలపేట  రోడ్డులో నాలుగు ఎకరాల స్థలం తీసుకొని డంపింగ్ యార్డ్ కొరకు ఫెన్సింగ్ కూడా వేసి ఉన్నారు అని, అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడితే ఒప్పుకోమని అనటంతో మా దూబగుంట  గ్రామాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు మా ఆవేదనను అర్థం చేసుకొని దూబగుంటలో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు విరమించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దూబగుంట గ్రామానికి చెందిన పల్నాటి చెన్నయ్య, బండి భగత్ సింగ్, నత్తా నాగరాజు, బండి మాల్యాద్రి, తుమ్మ రమేష్, పల్నాటి కేశవరావు, మేళం తిరుమల రావు, బండి మల్లేష్, మిడసల  ప్రవీణ్, బలికల శ్రీనివాసులు, గౌడ పేరు శ్రీను, అన్నపు రెడ్డి వెంకటయ్య, కొమిరెడ్డి శీను, అన్నపురెడ్డి ప్రసాదు, కొమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు, గ్రామానికి చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)