ప్రమాద బాధితులకు సహాయం చట్టంపై అవగాహన

bsbnews
0

 ప్రమాద బాధితులకు సహాయం చట్టంపై అవగాహన 

BSBNEWS - కందుకూరు


36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా గురువారం కందుకూరు ఏరియా హాస్పిటల్ లో కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టివిఎన్ లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రమాద బాధితులకు సహాయం చేసే చట్టంపై (గుడ్ సమారిటన్ లా) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాద బాధితులకు సహాయం చేసే చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి ప్రమాదం జరిగిన వెంటనే ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో బాదితులకు మీ వంతు సహాయం అందించేలా వారిని హాస్పిటల్ కు చేర్చి ఒక్క ప్రాణానైనా కాపాడే విధంగా బాధ్యత తీసుకోవాలని ఆమె వైద్యశాల సిబ్బంది, ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కోటారెడ్డి హాస్పిటల్, అజ్మల్ హుస్సేన్ నర్సింగ్ హోమ్ నందు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి వాల్ పోస్టర్లను విడుదల చేసి హాస్పిటల్లో అంటించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెన్నూరి రాంబాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన గంటలోపు (గోల్డెన్ హవర్) క్షతగాత్రులకు సహాయం చేసిన వ్యక్తినీ 'గుడ్ సమరిటన్' గా గుర్తించి ప్రభుత్వం వారు నగదు రూ.5000/- ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని ప్రమాదం జరిగిన గంట లోపల బాధలకు వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎం.శకుంతల, నెల్లూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్.మల్లికార్జున్ రెడ్డి, రవాణా శాఖ, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)