- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి అందజేసిన గుండ్రెడ్డి రామకృష్ణ
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణానికి చెందిన గుండ్రెడ్డి రామకృష్ణ కందుకూరు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కొరకు తనవంతుగా 1 లక్ష రూపాయల విరాళాన్ని కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధికి తన వంతుగా 1లక్ష రూపాయలను సహాయం అందించిన రామకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపర్ నెండెంట్ శకుంతల దేవి, డాక్టర్ ఇంద్రాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, హాస్పిటల్ కమిటీ మెంబర్ శిగా తిరుపాలు, ఓరుగంటి రామ్మూర్తి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.