ప్రభుత్వం పెంచిన పని భారం వలనే ఆ తప్పు జరిగింది
BSBNEWS - VALETIVARIPALEM
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు వందరోజుల స్టడీ పరీక్ష నిర్వహించి వాటిని సరిచేసి వాటి ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి. వెనుకబడిన విద్యార్థులకు గుర్తించి వారిని మెరుగుపరచాలి. అయితే వలేటివారిపాలెం మండలంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో ఇటీవల 100 రోజుల స్టడీ పరీక్షలు నిర్వహించి వాటిని పక్కన పడేశారు. డిప్యూటీ డిఇఓ తనిఖీ నిర్వహించే సందర్భంలో ఆ విషయం బయటకు వచ్చింది. ఎందుకు ఇలా చేశారని అడిగితే ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై వి ఎస్ బి న్యూస్ ఛానల్ విలేకరి ప్రధానోపాధ్యాయులును అడగగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెంచిన పని భారం వలన ఆ పొరపాటు జరిగిందని దాన్ని సరి చేయమని డిప్యూటీ డిఇఓ చెప్పడం జరిగిందని దానిని సరిచేస్తున్నామని చెప్పడం గమనార్హం.