వ్యాధులు పట్ల పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి
ఈఓ డిఎల్ డి ఏ డాక్టర్ చెరుకూరి చంద్రశేఖర రావు
BSBNEWS - వలేటివారిపాలెం
మండల పరిధిలోని, పోకూరులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ అధికారి ఈ ఓ డి ఎల్ డి ఏ, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ డాక్టర్ చెరుకూరి. చంద్ర శేఖర్ రావు ప్రత్యేక అతిథి గా హాజరయ్యారు. ఈ శిబిరంలో
4 పశువులకు యెద ఇంజెక్షన్లు
12 గేదెలకు చూడి పరీక్షలు
34 పశువులకు సాధారణ వ్యాధుల చికిత్సలు
26 మంది రైతులకు లివర్ టానిక్ కాల్షియం పౌడర్ ప్యాకెట్లు ను రైతులకు అందజేశారు. తదనంతరం రైతు అవగాహన సదస్సులో భాగంగా పాడి రైతులకు తగు సూచనలను ఇచ్చారు. పశు వైద్యాధికారి వంశీ మాట్లాడుతూ రైతులు పడ్డ దూడలు త్వరగా ఎదకు రావడానికి, చూడి నిలవడానికి పలు సూచనలు ఇచ్చారు. పశువుల్లో ఈతకు ఈతకు మధ్య అంతరం తగ్గించుకోవాలి అని, తద్వారా ఒక పశువు నుండి జీవిత కాలంలో 7 ఈతలు వచ్చేలా ప్రణాలికలు చేసుకొని పాడి ఉత్పత్తి పెంచుకొని ఆర్ధికం గా ఎదగాలని ఆశించారు.కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ అనుపమ సిబ్బంది అశోక్, చౌడయ్య, వెంకట రావు, కిరణ్, తిరున్, రమేష్, దినేష్, మనోహర్, శ్రీమాన్ ,మౌనిక, మహిత,సృజన, గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.