ఎమ్మెల్యేను కలిసిన తల తోటి మస్తాన్
కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి ఖాయం
BSBNEWS - కందుకూరు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటన విజయవంతంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి ఎనలేనిదని టిడిపి నాయకులు తల తోటి మస్తాన్ అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తలతోటి మస్తా మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేయడంలో ఇంటూరి నాగేశ్వరరావు పాత్ర కీలకంగా ఉందని ఆ పాత్రను సక్రమంగా నిర్వర్తించాడని చెప్పడంలో శనివారం జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనే ఉదాహరణగా చెప్పవచ్చని ఆయన అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కందుకూరులో 50 కోట్ల రూపాయలను ప్రకటించటం పట్ల ఇంటూరి నాగేశ్వరరావు చూపిన ప్రత్యేక చొరవే అందుకు కారణమని ఆయన అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని అనడంలో ప్రజలకు ఉన్న సందేహం చంద్రబాబు నాయుడు పర్యటనతో తొలగిపోయిందని అందుకు ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.