అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
- అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్
BSBNEWS - KANDUKUR
అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కందుకూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యదర్శి ఎస్ కే రహంతున్నీసా అధ్యక్షతన నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్కే సల్మా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని జరుగుతున్న సమ్మె సందర్భంగా ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి మేము వస్తే మీ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని, ప్రభుత్వం ఏర్పాటు దాదాపు 8 నెలలు కావస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరామని, వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీను నెరవేర్చడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని ఆమె తెలిపారు. యూనియన్ గౌరవాధ్యక్షులు ఎస్ఏ గౌస్( సిఐటియు ) మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం 42 రోజుల సమ్మె జరిగే సందర్భంలో అంగన్వాడీల వద్దకు వచ్చి మీరు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి అని, మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలి అని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అని, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని, ప్రభుత్వం వైపు నుండి అన్ని సదుపాయాలు కల్పించాలి అని, పెండింగ్ లో ఉన్న అద్దె బిల్లులు డి ఏ లు అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా ఏర్పాటు చేయాలి అని, పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి అని, వేతనంతో కూడిన మూడు నెలల మెడికల్ లీవులు ఇవ్వాలి అని, ఫ్రీ స్కూలు బలోపేతం చేయాలి అని, ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీ సెంటర్లో చేర్చాలని జీవో ఇవ్వాలి అని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాని ఐసిడిఎస్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆరు సెక్టార్ల నుండి అధ్యక్ష కార్యదర్శులు, సిఐటియు నాయకులు డిఎం రాయుడు, ఎస్కే జరీనా, శశి, కేశవ కుమారి, రాధా, భారతీ, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.