మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

0

 మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

- ఏఐటియుసి సిఐటియు 

BSBNEWS - KANDUKUR

కందుకూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కే అనూష ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న మున్సిపాలిటీ జనాభా ప్రాతిపదికన పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వచ్చే సిఎల్ లను సక్రమంగా ఇవ్వాలని, పిఎఫ్, హెల్త్ కార్డులకు సంబంధించి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనంద మోహన్, సిఐటియు నాయకులు ఎస్ ఏ గౌస్, ఏఐటీయూసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాకుమాని రవణమ్మ, నాయకులు పులి నాగేశ్వరరావు, సిఐటియు అనుబంధ మున్సిపల్ నాయకులు ఎద్దు కొండమ్మ, శేషమ్మ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)