పారిశుద్ధ కార్మికులు సంఖ్య పెంచాలి
ఏఐటియుసి, సిఐటియు డిమాండ్
BSBNEWS - కందుకూరు
పెరుగుతున్న కందుకూరు మున్సిపాలిటీ తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏఐటీయూసీ సిఐటియు నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి సిఐటియు నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ స్వచ్ఛతలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనది అని అటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం సరైనది కాదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న జనాభా నివాసాల ప్రకారం సంఖ్యను పెంచి పారిశుద్ధ కార్మికుల వారాన్ని తగ్గించాలని వారు అన్నారు. వాటితోపాటు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మాజీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూసి సురేష్ బాబు, నియోజకవర్గ కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనందమోహన్, సిఐటియు నాయకులు గౌస్, ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాకుమాని రవణమ్మ, సిఐటియు అనుబంధ నాయకులు ఎద్దు కొండమ్మ తదితర పారిశుద్ధి కార్మికులు పాల్గొన్నారు.