అంగన్వాడీలో గుడ్లు తేలుతున్నాయోచ్...
అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా...?
BSBNEWS - VALETIVARIPALEM
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భవతులకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించి పౌష్టికాహార లోపం లేని చిన్నారులు తయారు చేయాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి పౌష్టికాహారం అందిస్తుంది. అయితే కొన్ని అంగన్వాడీ సెంటర్లలో మాత్రం పౌష్టికాహారం కాస్త విషపూరిత ఆహారంగా మారుతుంది. అందుకు ఉదాహరణగా వలేటివారిపాలెం మండలంలోని కొండ సముద్రం గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాలను చెప్పొచ్చు. కొండ సముద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో కోడిగుడ్లు పరీక్షించగా కోడిగుడ్లు నీళ్ళల్లో తేలుతున్నాయి. వాటిని బట్టి చూస్తే బాలింతలకు, గర్భవతులకు సరైన టైంలో కోడిగుడ్లను పంపిణీ చేయడం లేదని అర్థమవుతుంది. అయితే పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయకపోవటమే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని సమాచారం.