కార్పొరేషన్ లోన్లకు ఇంటర్వ్యూలు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ లోన్ లకు బ్యాంకు వారు ఇంటర్వ్యూలు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కే అనూష మాట్లాడుతూ ప్రభుత్వం వారు పేదవారికి ఆసరాగా వారి ఆర్థిక అభివృద్ధి మెరుగుపరిచేందుకు కార్పొరేషన్ ద్వారా లోన్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వాటి కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు సంబంధిత బ్యాంకు వారు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి పత్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం అర్హత కలిగిన వారికి తప్పకుండా లోన్ మంజూరు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.