ఉపాధ్యాయురాలు జ్ఞాపకార్థం శిష్యులు ఏమి చేసారో..చూడండి

bsbnews
0

ఉపాధ్యాయురాలు జ్ఞాపకార్థం శిష్యులు ఏమి చేసారో..చూడండి

BSBNEWS - గుడ్లూరు

చదువుకున్న విద్యార్థులు తమ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవడం చాలా అరుదు. అలాంటి విద్యార్థులు తమకు హింది నేర్పించిన ఉపాధ్యాయురాలు మరణించిన తరువాత ఆమె జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామ బస్టాండు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ రామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వెండి పాదుకలను  కందుకూరుకు చెందిన ప్రముఖ హిందీ టీచర్ నల్లమల్లి నవనీతమ్మ జ్ఞాపకార్థం వారి శిష్యులు అందరూ కలిసి ఏర్పాటు చేశారు. గొల్ల పద్మావతి  సూచన మేరకు నవనీతమ్మ టీచర్ శిష్యులు అందరూ కలిసి స్వామి వారికి అరకిలో వెండి పాదుకల నిమిత్తం 54,000 రూపాయలతో పి. శిరీష, గొల్ల పద్మావతి, జి. లావణ్య , సిహెచ్. మస్తాన్ కుమారి, యు. గీతా కుమారి, ఎన్. సునీత, కె.సుప్రజ, జి. సుభాషిణి, కె. సురేఖ, అందరూ కలిసి కొనుగోలు చేయడం జరిగింది. వారికి ఆ సీతా రామ లక్ష్మణ భరత శతృఘ్న సమేత శ్రీ సువర్చలా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ తరపున  వారికి, గొల్ల పద్మావతికి ఆలూరి వెంకట హనుమంతరావు కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీఅన్నదానం చిదంబర శాస్త్రి సూచన మేరకు పాదుకలు నమూనా తీసుకుని పాదుకలు తయారు చేయడం జరుగుతుందని ట్రస్ట్ అధ్యక్షుడు హనుమంతరావు తెలిపారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)