పిల్లల్లో బోధన సామర్ధ్యాన్ని పెంచాలి - డిఈఓ

bsbnews
0

పిల్లల్లో బోధన సామర్ధ్యాన్ని పెంచాలి

జ్ఞాన జ్యోతి శిక్షణ శిబిరాలను సందర్శించిన డిఈఓ,ఏఎంవో

BSBNEWS - కందుకూరు

పిల్లల్లో బోధన సామర్ధ్యాన్ని పెంచాలని డిఈఓ ఆర్ బాలాజీరావు సూచించారు. స్ధానిక జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణ శిబిరాలను జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు, జిల్లా సమగ్ర శిక్ష ఏఎంవో జి.సుధీర్ బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య మూడు నుంచి ఐదు సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు ఎంతో కీలకమైందని ఈ దశలోనే విద్యార్థుల శారీరక, మానసిక భాష మేధస్సులలో అభివృద్ధి అధికంగా జరుగుతుందని కార్యకర్తలందరూ సరైన శిక్షణ పొంది చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు సూచించారు. శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల అభివృద్ధి పెరుగుదల ఆరోగ్యం అనే అంశాలతో పాటు బోధన సామర్థ్యాలు కూడా మెరుగపరచాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఈ శిక్షణలో కార్యకర్తల తయారుచేసిన అభ్యసన సామాగ్రి మేళాను ప్రత్యేకంగా వారు తిలకించారు. శిక్షణ ఏర్పాటు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు కె సుబ్బారెడ్డి, బి అజయ్ బాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు షకీల, లక్ష్మీదేవమ్మ, ప్రభావతి, రిసోర్స్ పర్సన్సన్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)