మాచవరం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా ఈసీసీఈ డే
BSBNEWS - కందుకూరు
మండలంలోని మాచవరం గ్రామంలో అంగన్వాడి నాలుగో సెంటర్ లో పూర్వ బాల్య దశ సంరక్షణ, విద్య( ఎర్లీ చైల్డ్ హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్) దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ శర్మిస్ట్ర అంగన్వాడి కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు చిన్నారుల ప్రతిభను గురించి వివరించారు. ప్రాథమిక విద్య, పిల్లల సమగ్ర అభివృద్ధి, సంరక్షణ అందరికీ సాధ్యమైనంత తొందరగా అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. స్కూల్ ఆక్టివిటీస్ గురించి, బాలింతలకు గర్భిణీ, బాలింతలకు స్త్రీలకు పౌష్టిక ఆహారం గురించి తెలియజేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలను పిల్లల తల్లులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రభావతి, అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎం విజయలక్ష్మి, వరల్డ్ విజన్ సిబ్బంది, చిన్నారుల వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.