విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డీప్ టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవాలి

bsbnews
0

 విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డీప్ టెక్నాలజీ పై అవగాహన పెంచుకోవాలి

 ఏపీ మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య 

BSBNEWS - కొండపి - సింగరాయకొండ:-




రోజు రోజుకు దేశంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర  సాంకేతిక రంగాలలో వస్తున్న అభివృద్ధి  కొత్త కొత్త ఆవిష్కరణల గురించి గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలని రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పిలుపు ఇచ్చారు. శనివారం కొండపి నియోజకవర్గం పరిధిలోని సింగరాయకొండ మండల కేంద్రంలో గీతం విద్యా సంస్థల ఆద్వర్యంలో జి. .లక్ష్మణ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ దేశంలో శాస్త్ర  సాంకేతిక వైజ్ఞానిక పరిశోధనల రంగంలో అభివృద్ధి చెందుతున్న  విజ్ఞానాన్ని కొత్త కొత్త పరిశోధనలు ఆవిష్కరణలు గురించి పాఠశాల స్థాయినుంచి అవగాహన కలిగి ఉండాలని పిలుపు ఇచ్చారు. ఎన్ డి ఎ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ప్రత్యేకంగా రాష్ట్రం లో ముఖ్యమంత్రి విజన్ 2020 తరహాలో 2047 కి శ్రీకారం చుట్టారని దాన్ని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అందిపుచ్చు కునేవిధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని  పిలుపు ఇచ్చారు. ప్రత్యేకించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డీప్ టెక్నాలజీ, విజన్ 2047 దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు అందిపుచ్చు కుని  ఆధునిక సమాజ  నిర్మాణానికి ఆవిష్కరణలకు తోడ్పడాలని ఆయన కోరారు.గ్రామీణ ప్రాంతం లో విద్యార్థులకు రోబో టెక్, డీప్ టెక్నాలజీ ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సింగరాయకొండ   గీతం విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా  గీతం విద్యాసంస్థల చైర్మన్ లక్ష్మణ రావు మాట్లాడుతూ కొంత కాలంగా ప్రత్యేకించి గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ విద్యార్దులకు  తీసిపోరని వారిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేయడం జరుగుతుందని దీన్ని విద్యార్థులు అందిపుచ్చు కోవాలని కోరారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలను సత్య నారాయణ, సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య, సంస్థ చైర్మన్ లక్ష్మణ రావు పరిశీలించి విద్యార్థులను ఆయా ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతం విద్యా సంస్థల సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)