చుండిలో పొలం పిలుస్తుంది

bsbnews
0

చుండిలో పొలం పిలుస్తుంది

BSBNEWS - వలేటివారిపాలెం


మండలంలోని పోలినేని చెరువు పరిధిలోని గరుకుపాలెం, చుండి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య కొరకు ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసినదిగా తెలిపారు. రాష్ట్రంలో భూమి గల ప్రతి రైతు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్య ఇవ్వటం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా మారిన అందుబాటులోకి తీసుకొని రావటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఇది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహతర కార్యక్రమం అని అన్నారు. భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, రాయితీపైన సూక్ష్మ పోషకాలు, వ్యవసాయాంత్రీకరణ, పంట రుణాలు వంటి పథకాలకు వర్తిస్తుంది అన్నారు. మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లోని  గ్రామ వ్యవసాయ ఉద్యానవన సహాయకులను సంప్రదించి రైతు గుర్తింపు సంఖ్య పొందవచ్చు అని తెలిపారు. రైతులు వారి యొక్క ఆధార్ నంబర్, ఆధార్ అనుసంధారక ఫోన్ నెంబర్, భూమి రికార్డు వివరములు తీసుకొని రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ రబీ సీజన్లో సాగు చేసిన పంటలన్నీ ఈ పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సిహెచ్ రవీంద్ర, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)