గ్రామ అభివృద్ధికి సహకరించాలి
BSBNEWS - PONNALUR
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముండ్లమూరి వారి పాలెం గ్రామానికి పలు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ మేరకు గ్రామంలో పనులు వేగవంతం చేయాలని ముండ్లమూరి వారి పాలెం గ్రామస్తులు నేడు హైదరాబాద్ లోని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ను కలసి విన్నవించారు. గ్రామానికి చెందిన యువ నాయకులు నల్లూరి మాధవ ఆధ్వర్యంలో యువకులు శనివారం దామచర్ల సత్యను మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులపై విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి దామచర్ల కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సత్య తెలిపినట్లు అన్నారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టి ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు కాలువల నిర్మాణం, వ్యవసాయ సంబంధిత రోడ్లు త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామస్తులు దామచర్ల సత్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.