చిన్న పంతులుకి ఘనంగా వీడ్కోలు
BSBNEWS -కందుకూరు
లింగసముద్రం మండలం విఆర్ కోట గ్రామానికి చెందిన సినీ నటుడు, కళాకారుడు చిమ్మిలి మాలకొండయ్య చౌదరి (చిన్న పంతులు)కి ఘనంగా వీడ్కోలు పలికారు. మలినేని విద్యాసంస్థల చైర్మన్, సినీ యాక్టర్ మలినేని లక్ష్మయ్య, వీడే మన వారసుడు సినిమా హీరో, నిర్మాత, దర్శకులు, రచయిత, ఉప్పు రమేష్ చిన్న పంతులు పార్థివ దేహానికి నివాళులర్పించారు. చిన్న పంతులతో రమేష్ కు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మాజీమంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి చిన్న పంతులు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. చిన్న పంతులు పార్థివ దేహానికి బంధువులు, స్నేహితులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.