మాకు కట్టెల పొయ్యే దిక్కు

bsbnews
0

మాకు కట్టెల పొయ్యే దిక్కు

BSBNEWS - వలేటివారిపాలెం 

మండలంలోని కొండసముద్రం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో కట్టెల పొయ్యే మాకు దిక్కు సార్ అంటున్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వం గ్యాస్ పొయ్యి అందించి ప్రతి నెల వారికి గ్యాస్ కి తగ్గ బిల్లు ఇస్తోంది. కానీ ఆ అంగన్వాడి కేంద్రం మాత్రం అందుకు నోచుకోలేదని చెబుతున్నారు. అది నిజమా అబద్దమా అని ఉన్నత అధికారులు తేల్చాల్సిన అవసరముంది. సూపర్వైజర్ ను వివరణ అడగగా అంగన్వాడి కేంద్రంలో కొన్నిటికి గ్యాస్ పొయ్యిలేదని కట్టెల పొయ్యిలోనే వంట వండుతున్నారని చెప్పటం విశేషం. అయితే బిల్లులు మాత్రం గ్యాస్ కి పెట్టి వారికి ఇస్తున్నామని తెలిపారు. గ్యాస్ లేకుండా గ్యాస్ కి బిల్లు పెడుతున్నామని చెప్పటం ఆశ్చర్యకరం. కట్టెలు పొయ్యి వాడుతున్న ప్రతి అంగన్వాడీలకు గ్యాస్ పొయ్యి లకు ప్రపోజల్ పెట్టామని త్వరలోనే వారికి గ్యాస్ పొయ్యి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)