అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం సహాయనిధి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

0

అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం సహాయనిధి

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - కందుకూరు 


వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతున్నాయని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే అపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గుడ్లూరు మండలం చినలాటిరిపు గ్రామంకు చెందిన కొప్పుల అన్నపూర్ణ 20000/- లు రూపాయలు, గుడ్లూరు మండలం పొట్లూరు గ్రామంకు చెందిన  కంపరాజు తరుణ్ రాజ్   250803/- రూపాయలు, కందుకూరు మండలం బలిజిపాలెం గ్రామంకు చెందిన ఇండ్ల సుబ్బారావు 30000/- రూపాయలు, కందుకూరు మండలం కోవూరు గ్రామంకు చెందిన పాలేటి ఇసాక్ కి 43478/- రూపాయలు, కందుకూరు పట్టణం లోని నాంచారమ్మ కాలనీకి చెందిన పిటికిటి లక్ష్మీనరసింహంకి   74424/- రూపాయలు, కందుకూరు పట్టణంలోని జనార్ధన్ కాలనీకి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ కి 155338/- రూపాయలు, కందుకూరు పట్టణంలోని ఖాజీపాలెంకి చెందిన షేక్ నాగూర్ కి 110343/- రూపాయలు, కందుకూరు పట్టణంలోని తూర్పు వడ్డిపాలెంకి చెందిన చీమల మాలకొండయ్య 53966/- రూపాయలు, కందుకూరు పట్టణంలోని తుర్పుకమ్మపాలెంకి చెందిన తిరువీద్దెళ్ళ శిరీషకి  25000/- రూపాయలు, కందుకూరు పట్టణంలోని సాయినగర్ కి చెందిన డోరాడ్లా  అనిల్ కుమార్ కి 25000/- రూపాయలు, లింగసముద్రం మండలం పెంట్రాల గ్రామంకి చెందిన దొండేటి హాజరత్తయ్య   37292/- రూపాయలు, వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామం కి చెందిన జాలరి చెన్న కృష్ణయ్య  23920/- రూపాయలు, వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలెం గ్రామంకి చెందిన కొంకా మనోహర్ కి  20000/- రూపాయలు మొత్తం 13 మంది కలిపి 899564/- రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ  తమ అనారోగ్యానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండలం పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, నాదెళ్ల వెంకట రమణయ్య, మచ్చు  శ్రీను ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)