సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలను పెంపొందిస్తుంది.
BSBNEWS - కందుకూరు
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ కెవి రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పదోనోపాధ్యాయులు డి బాలబ్రహ్మం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ కే సుబ్బారెడ్డి మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలం అలవడుతుందని సైన్స్ నిజజీవితంలో ఎంతోగాను ఉపయోగపడుతుందని విద్య విజ్ఞానం పెంపొందించుటకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. స్కూల్ డైరెక్టర్ వి.షాలిని రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో సైన్స్ మానవునికి ఎంతో తోడ్పడుతున్నదని సైన్స్ పట్ల అవగాహనాలతో విద్యార్థుల మెలిగొదాల్సిన అవసరం ఉందని తెలిపారు. సైన్స్ ఫేర్వెల్ లో నాగార్జున స్కూల్ అన్ని తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ విషయాలు విజ్ఞానదాయకంగా ఉన్నాయి. ఆహుతులను, తల్లిదండ్రులను ఎంతోగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో నాసా సైంటిస్ట్ జి.శబరిస్(యు ఎస్ ఏ) డైరెక్టర్ వి.మర్రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కే శ్రీనివాసరావు, సునీల్, పి. శ్రీనివాసరావు, సుహాసిని, సి. హెచ్. రమేషు, మల్లీ ,బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.