అమ్మో ఆ అన్నమా...
- ఎండిఎం ను మరింత నాణ్యంగా కావాలనుకోవడం ఆశ అవుతుంది
- టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్
BSBNEWS - KANDUKUR
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం నాణ్యతకు దూరమవుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పట్టణంలోని టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాల లో మధ్యాహ్నం విద్యార్థులకు అందించే భోజనం మరి దారుణంగా ఉందని పలువురు నుంచి విమర్శలు వస్తున్నాయి. భోజనాన్ని సైతం విద్యార్థులకు విద్యార్థులు వడ్డించటం గమనార్హం. టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను వివరణ అడగగా నిజానికి ఆ భోజనం కందుకూరు లోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే భోజనం అంతకుమించి ఎక్కువ నాణ్యత కోరుకోవడం ఆశ అవుతుందని ఆశకి అంతం ఉంటుందని చెప్పడం విశేషం. విద్యార్థులు చేత పని చేయించడం ఎంతవరకు న్యాయమని అడగగా ఉపాధ్యాయులు పరీక్షలకు డ్యూటీ మీద వెళ్లారని అందుకని వారి చేత భోజనం వడ్డిస్తున్నామని అదేమి తప్పు కాదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థులతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చెబుతున్న వాటిని లెక్కకు చేయకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు విద్యార్థులు చేత పనిచేపించడం సర్వసాధారణమైంది. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఆదిశగా పని చేస్తున్నారా లేదా అన్న అనుమానాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వినిపిస్తున్నాయి.