కుంట భూముల సంరక్షణకు వినతి

0

కుంట భూముల సంరక్షణకు వినతి 

BSBNEWS - కందుకూరు 

గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామపంచాయతీ లోని సర్వే నెంబర్ 19/2 లోని కుంట పోరంబోకు భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టు గౌడ పేరు రామయ్య సోమవారం కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు అందజేసిన వినతిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారకానిపాడు గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 19/2 లోని కుంట పోరంబోకు ప్రభుత్వ భూమిని డబ్బు, రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించి, అక్రమ కట్టడంలు నిర్మిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూములలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించాలని గుడ్లూరు ఎంపీడీవో కు అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని సబ్ కలెక్టర్ కు వివరించారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ను కోరారు. దానికి స్పందించిన సబ్ కలెక్టర్ తక్షణం ప్రభుత్వ భూములలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని గుడ్లూరు ఎంపీడీవోను ఆదేశించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)