విమర్శలలో ఫుడ్ కమీషన్ చైర్మన్ పర్యటన
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణంలో రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మంగళవారం పర్యటించారు. అయితే తను వచ్చే విషయం ముందుగానే తెలియడంతో కందుకూరులోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు జాగ్రత్తలు పడ్డాయని ప్రతినిత్యం జరిగే ఆహారంలో లోపాలను సరి చేసుకొని అన్ని సక్రమంగా ఉన్నట్టు చూపించారని అలాంటప్పుడు ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటన ఎవరికోసం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందుకూరు కస్తూర్బా బాలికల పాఠశాల గురించి ప్రజల నుండి అక్కడ భోజనం సరిగా పిల్లలకు అందించడం లేదని అనేక విమర్శలు నేరుగా నా దృష్టికి వచ్చాయని ఫుడ్ కమిషన్ చైర్మన్ కందుకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఆ పాఠశాలలో ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటించినప్పుడు చిన్నచిన్న లోపాలు తప్ప అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పడం విశేషం. ముందస్తు సమాచారం అందడంతో అన్నిచోట్ల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాలుర హైస్కూల్లో పిల్లలకు వండే ఆహారం కట్టెల పొయ్యి మీద వండేవారు. అయితే ఫుడ్ కమిషన్ చైర్మన్ వస్తున్నారని సమాచారంతో కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్ పోయి వెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కందుకూరులో విద్యార్థులకు అందించే ఆహార విషయంలో ఉన్న అన్ని లోపాలు ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటన రోజు కానరాకుండా పోయాయి.